• Oct 27, 2026
  • NPN Log

    చెన్నై : వరుస ప్రయోగాలతో దూసుకెళ్తున్న ఇస్రో తన ప్రయోగ వేదికలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. 2029 నాటికి తమ క్రియాశీల ప్రయోగ వేదిక(లాంచ్‌ ప్యాడ్‌)లను నాలుగుకి పెంచుతామని ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు. ఉపగ్రహ ప్రయోగాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్టణంలో 2,000 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ (ఎస్‌ఎ్‌సఎల్వీ) కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇస్రోను ప్రైవేటీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఉపగ్రహ ప్రయోగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను తీర్చడానికి ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం అవసరమని నొక్కిచెప్పారు. రాబోయే రెండు నెలల్లో గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా తొలి మానవరహిత ప్రయోగం నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం శ్రీహరికోటలో ఇస్రోకు రెండు లాంచ్‌ ప్యాడ్‌లు ఉన్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement