26 కోట్లతో హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు
న్యూఢిల్లీ : అమృత్ భారత్ పథకం కింద రూ.25.95 కోట్లతో తెలంగాణలోని హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను కేంద్రప్రభుత్వం చేపట్టినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు దాదాపు 80శాతం వరకు పూర్తయ్యాయన్నారు. దివ్యాంగులకు సౌకర్యాల కల్పనతో పాటు, ప్లాట్‌ఫారంపై అదనపు షెల్టర్ల నిర్మాణం పూర్తికాగా, స్టేషన్ బిల్డింగ్, వెయిటింగ్ హాల్, 12 మీటర్ల వెడల్పుతో పాదచారుల వంతెన తదితర అభివృద్ధి పనులు పూర్తికావస్తున్నాయని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో కేంద్రప్రభుత్వం రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
Comments