30 ఏళ్లకు పైగా ఒకే సినిమా… అయినా తగ్గని క్రేజ్
నేడు ఏ సినిమా అయినా వారం, పది రోజులు ఆడటమే కష్టం. అలాంటిది ఓ థియేటర్లో 30 ఏళ్లకు పైగా ఒకే సినిమా వేస్తున్నారంటే ఆశ్చర్యమే. ముంబైలోని మరాఠా మందిర్లో ‘దిల్‌వాలే దుల్హనియే లే జాయేంగే’ రిలీజైనప్పటి నుంచి ప్రదర్శితమవుతోంది. 1995 అక్టోబర్ 20న ఇది రిలీజైంది. ‘30సార్లు ఈ మూవీ చూశా. ఇంకా చూస్తా’ అని 60 ఏళ్ల షక్రీ అన్నారు. 1975లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘షోలే’ 5ఏళ్లు ఆడగా దిల్‌వాలే దుల్హనియే లే జాయేంగే దాన్ని అధిగమించింది.
Comments