అందుకే అలా మాట్లాడా: నిర్మాత రాజేశ్
నిన్న ఓ వెబ్‌సైట్‌పై ఫైరయిన ‘K RAMP’ నిర్మాత రాజేశ్ దండా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘రేటింగ్ ఇవ్వడంపై అభ్యంతరం లేదు. కానీ ఆదరణ పెరిగాక నెగటివ్ వార్తలు రాయడం బాధించింది. నేను వాడిన భాష అభ్యంతరకరం అంటున్నారు. రూ.కోట్లు ఖర్చుచేసిన నా సినిమాను చంపేసే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా. అందుకే అలా మాట్లాడా. సినీ జర్నలిస్టులంటే నాకు ఎప్పుడూ గౌరవమే’ అని ట్వీట్ చేశారు.
Comments