4 ని.ల జూమ్ కాల్‌తో ఉద్యోగులకు ఉద్వాసన
భారత ఉద్యోగులకు 4ని.ల జూమ్ కాల్‌తో ఉద్వాసన పలికిందో అమెరికా కంపెనీ. ఉన్నపళంగా రోడ్డున పడి వారు లబోదిబోమంటున్నారు. దీనిపై ఓ ఉద్యోగి పెట్టిన పోస్టు వైరలవుతోంది. ‘ఎప్పటి మాదిరిగానే సిస్టమ్‌లో లాగిన్ అయ్యా. 11గం.లకు COO జూమ్ కాల్ చేసి రీస్ట్రక్చరింగ్‌లో ఇండియన్ వర్క్‌ఫోర్స్‌ను తొలగిస్తున్నాం అని ప్రకటించారు. ఇంకే మాటల్లేకుండా కాల్ కట్ చేశారు’ అని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులంతా షాక్‌కు గురయ్యారు.
Comments