‘5 రాష్ట్రాలు దాటి వచ్చారా?’.. అల్లు అర్జున్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు
తన పర్సనాలిటీ రైట్స్ పరిరక్షించాలని అల్లు అర్జున్ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఢిల్లీ, తెలంగాణకి మధ్య 5 రాష్ట్రాలున్నాయి. ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు’ అని జస్టిస్ తుషార్ రావు ప్రశ్నించారు. దీనిపై అల్లు అర్జున్ న్యాయవాది స్పందిస్తూ.. హక్కుల ఉల్లంఘన దేశమంతటా జరుగుతోందని, అందుకే రావాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో బన్నీ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలని జడ్జి ఆదేశాలిచ్చారు.










Comments