538 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు
ఏపీ వైద్యారోగ్యశాఖలో 538 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు దరఖాస్తు గడువును అక్టోబర్ 10వరకు ప్రభుత్వం పొడిగించింది. దరఖాస్తు ప్రక్రియలో టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ అర్హతతో పాటు ఏపీఎంసీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 42ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, EWS, దివ్యాంగులకు రూ.750. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Comments