• Oct 05, 2025
  • NPN Log

    హైదరాబాద్‌ : విద్యుత్‌ పంపిణీ రంగంలో సంస్కరణల దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీం’ (ఆర్డీఎ్‌సఎస్‌) అమలుకు రూ.63,339 కోట్లతో తెలంగాణ డిస్కమ్‌లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను సిద్ధం చేశాయి. ఇందులో దక్షిణ డిస్కమ్‌ కోసం రూ.38,477 కోట్లు, ఉత్తర డిస్కమ్‌ కోసం రూ.24,862 కోట్లు అవుతాయని లెక్కకట్టాయి. ఆర్డీఎ్‌సఎస్‌ పథకాన్ని కేంద్రప్రభుత్వం 2021 జూలై 29న ప్రారంభించింది. దేశవ్యాప్తంగా రూ.3,03,758 కోట్ల వ్యయంతో చేపడుతామని ప్రకటించింది. తొలి గడువు 2025-26 ఆర్థిక సంవత్సరానికే పూర్తికాగా.. 2028 మార్చి 31వ తేదీ దాకా పొడిగించారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం విద్యుత్‌ సంస్థల ఆర్థిక సుస్థిరతకు చర్యలు తీసుకోవడం, నాణ్యమైన విద్యుత్‌ను అందించడం, పంపిణీ/సరఫరా/వాణిజ్య నష్టాలను 12-15 శాతానికి తగ్గించడం, డిస్కమ్‌ల ఆదాయానికి, అవసరాలకు మధ్య అంతరం శూన్యస్థాయికి తీసుకెళ్లడం. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ డిస్కమ్‌లు డీపీఆర్‌లను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాయి. వీటిని మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడే డిస్కమ్‌లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదురుతుంది. ఆర్డీఎ్‌సఎస్‌ అమలులో భాగంగా రెండు డిస్కమ్‌ల పరిధిలో వ్యవసాయ కనెక్షన్లు కాకుండా ఇతర వినియోగదారులకు స్మార్ట్‌/ప్రీ పెయిడ్‌ మీటర్లు బిగించాల్సి ఉంటుంది. దీనికి రూ.17,924 కోట్ల వ్యయం అవుతుందని లెక్కకట్టారు. స్మార్ట్‌/ప్రీపెయిడ్‌ మీటర్లకు అయ్యే వ్యయంలో 15ు లేదా మీటర్‌కు రూ.900లను కేంద్రం ఆర్థిక సహాయం కింద ఇవ్వనుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఎ్‌సఎ్‌సలో చేరడానికి సమ్మతి తెలుపకపోతే.. డిస్కమ్‌లు గనుక చేరితే.. ఈ పథకం అమలుకు అయ్యే వ్యయంలో 15ు ఇవ్వడానికి కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ అంగీకారం తెలిపింది. నష్టాలు తగ్గించుకోవడం, డిస్కమ్‌ల ఆధునికీకరణ, భూగర్భ కేబులింగ్‌, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.45,413 కోట్లు అవుతాయని అంచనాలు రూపొందించారు. ఇప్పటికే రాష్ట్ర సర్కారు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్కరణల కమిటీ(డీఆర్‌సీ)ని ఏర్పాటు చేసిన విషయం విదితమే ఈ కమిటీనే డీపీఆర్‌లకు తుదిరూపు ఇచ్చి.. వాటిని మంత్రివర్గం ఆమోదం కోసం పంపించనుంది. ఆమోదం తర్వాతే ఆర్డీఎ్‌సఎ్‌సలో డిస్కమ్‌లు చేరేందుకు వీలవుతుంది. ఈ పథకం నిబంధనల అమలు కు అంగీకారం తెలుపుతూ డిస్కమ్‌లు, రాష్ట్ర ప్రభు త్వం, కేంద్రం త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాల్సి ఉం టుంది. ఈ పథకం అమలును బట్టి ఇచ్చే మార్కుల ఆధారంగా రుణాలు తీసుకోవడానికి వెసులుబాటు లభించనుంది.


     

    50 మార్కులు లభిస్తే.. జీఎ్‌సడీపీలో 0.25ు రుణంగా డిస్కమ్‌ల కోసం తీసుకోవడానికి కేంద్రం వెసులుబాటు ఇవ్వనుంది. అదే 51-89 మార్కులు దక్కితే 0.25-0.50ు మేర జీఎ్‌సడీపీలో లోన్‌ తీసుకోవొచ్చు. 90 మార్కులు దాటితే 0.50ు రుణం తీసుకొవొచ్చు. 100ు స్మార్ట్‌ మీటర్లు పెడితే 10 మార్కులు, ఏటీ అండ్‌ సీ నష్టాలు గణనీయంగా తగ్గించుకుంటే 15 మార్కులు, క్రాస్‌ సబ్సిడీలను తగ్గించుకుంటే 5 మార్కులు, ఆదాయానికి, అవసరాలకు మధ్య అంతరం శూన్యస్థాయికి తీసుకెళితే 15 మార్కులు.. ఇలా ప్రతీదానికి మార్కులు కేటాయించారు. డిస్కమ్‌ల ప్రైవేటీకరణ లేదా కొత్త డిస్కమ్‌లకు లైసెన్సులు ఇస్తే 10 దాకా మార్కులు ఇస్తారు. రాష్ట్ర జీఎ్‌సడీపీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.16.12 లక్షల కోట్లుగా ఉండగా.. ఇందులో 0.5ు అంటే అదనంగా రుణం రూ.8060 కోట్లు తీసుకోవడానికి రాష్ట్రాలకు వెసులుబాటు ఇవ్వనున్నారు. ఇక ఈ పథకం అమలు కోసం అయ్యే వ్యయాన్ని రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎ్‌ఫసీ) నుంచి రుణం తీసుకోవడానికి వీలు కల్పించనున్నారు.

    పథకంలో చేరితే చేయాల్సింది ఇదీ..

    ఆర్డీఎ్‌సఎస్‌ పథకంలో భాగంగా.. రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లు మినహా మిగిలిన వినియోగదారులందరికీ ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇది తప్పనిసరి. డిస్కమ్‌ల ఆదాయం, వ్యయాలకు మధ్య అంతరాన్ని ఆర్‌డీఎ్‌సఎ్‌సలో చేరిన నాటి నుంచి ఐదేళ్లలో శూన్యస్థాయికి చేర్చాలి. విద్యుత్‌ చౌర్యం నియంత్రణ కోసం ప్రత్యేకంగా డిస్కమ్‌లే పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలి. ఫీడర్లు/పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు బిగించి... వాటిని జాతీయ ఫీడర్‌ మానిటరింగ్‌ వ్యవస్థకు అనుసంధానించాలి. టారి్‌ఫను హేతుబద్ధీకరించాలి. ఏటా నవంబరు 30వ తేదీలోపు టారిఫ్‌ పిటిషన్లను విద్యుత్‌ నియంత్రణ మండళ్లలో దాఖలు చేయాలి. నష్టాలు వచ్చే ప్రాంతాలను ఫ్రాంచైజీల కింద అప్పగించాలి (దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు). విద్యుత్‌ సరఫరా కోసం కేబుళ్లు వేయాలి. 2.75 లక్షలకన్నా అధికంగా జనాభా ఉన్న నగరాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ‘సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డాటా అక్విజేషన్‌’ (స్కాడా) పరిధిలోకి తీసుకురావాలి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement