EPFO గుడ్న్యూస్.. వారి ఖాతాల్లో నగదు జమ
EPFOలో క్లెయిమ్ చేసుకోని డిపాజిట్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా యాక్టివ్గా లేని ఖాతాల్లోని డబ్బును చందాదారులకు ఇవ్వనుంది. 31.86 లక్షల ఇనాక్టివ్ ఖాతాల్లో ₹10,903 కోట్లున్నాయి. తొలి దశలో ₹1000 లోపు బ్యాలెన్స్ ఉన్న 7 లక్షల అకౌంట్లలో పైలట్ ప్రాజెక్టుగా ఆ మొత్తాన్ని జమ చేయనుంది. తర్వాత మిగతా ఖాతాల్లో రిఫండ్ చేయనుంది. మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు లేని ఖాతాలను ఇనాక్టివ్గా పరిగణిస్తారు.










Comments