IPL 2026లో కొత్తగా కనిపించనున్న కేన్ మామ!
'దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి' అనే సామెతను సినీ రంగానికి చెందిన వారు ఎక్కువగా పాటిస్తుంటారు. అలానే క్రీడా రంగంలో కూడా కొందరు ప్లేయర్లు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతుంటారు. తాజాగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఐపీఎల్ లో తన కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ అద్భుతమైన బ్యాటింగ్ తో క్రికెట్ లో ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఐపీఎల్ లో కూడా తన సత్తా చూపించాడు. ఇక తాజాగా ఐపీఎల్ 2026లో కేన్ కోచ్‌గా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దమయ్యాడు.కెరీర్ చివరి దశలో ఉన్న కేన్ మామ.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పకముందే.. భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నాడు. విలియమ్సన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఎన్నో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి చిరస్మరణీయ విజయాలు అందించాడు. అందుకే అందరూ ఆయన్ను ముద్దుగా కేన్ మామ అని పిలుచుకుంటారు. ఇక ఐపీఎల్ 2025 సీజన్‌లో అన్‌సోల్డ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అప్ కమింగ్ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. గత సీజన్‌లో లక్నో జట్టు మెంటార్, బౌలింగ్ కోచ్‌గా బాధ్యతల నిర్వర్తించిన టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తప్పుకోవడంతో అతని స్థానాన్ని కేన్ తో భర్తీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎల్ఎస్‌జీ హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్ ఉన్న విషయం తెలిసిందే.
Comments