KG గోల్డ్: ఒకప్పుడు మారుతి 800.. ఇప్పుడు డిఫెండర్
బంగారం ధరలు ఎంతలా పెరుగుతున్నాయో తెలిపేందుకు ఈ ఉదాహరణే నిదర్శనం. 1990లో KG గోల్డ్ ధర(రూ.3.2లక్షలు)కు మారుతీ 800 కారు వచ్చేది. 2005లో కేజీ గోల్డ్ కొనే డబ్బులతో ఇన్నోవా, 2010లో ఫార్చునర్ కారు వచ్చేవి. ఇప్పుడు కేజీ గోల్డ్ ధర రూ.1.17కోట్లుగా ఉండగా దీనితో డిఫెండర్ కొనొచ్చని, 2030లో రోల్స్ రాయిస్ కారు వస్తుందని నెట్టింట చర్చ జరుగుతోంది. ఇందుకే చాలామంది పసిడిని బలమైన పెట్టుబడిగా భావిస్తున్నారు.
Comments