• Apr 19, 2026
  • NPN Log

    ఈ విశాల విశ్వంలో అనేక పాల పుంతలు, సౌర మండలాలు ఉన్నాయి. మన భూమిని పోలిన గ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. భూమిని పోలిన గ్రహాల గురించి శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు. అలాంటి ఆసక్తికర గ్రహాల్లో ఒకటి 'TOI-561 b'. ఇది ఒక సూపర్ ఎర్త్ గ్రహం. దీని ప్రత్యేకతలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా భూమి కంటే పెద్దవైన రాతి గ్రహాలను సూపర్ ఎర్త్ అని పిలుస్తుంటారు. ఇవి ఘన ఉపరితలం కలిగిన గ్రహాలు

    'TOI-561 b' గ్రహాన్ని ట్రాన్‌సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) అనే అంతరిక్ష మిషన్ ద్వారా గుర్తించారు. ఈ 'TOI-561 b' గ్రహం భూమి కంటే సుమారు 1.4 రెట్లు పెద్దది. భారం 3 రెట్లు ఎక్కువ. ఈ గ్రహం TOI-561 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. ఈ సూపర్ ఎర్త్ ఆ నక్షత్రం చుట్టూ తిరగడానికి కేవలం 10.5 గంటలు మాత్రమే పడుతుంది. అంటే దాదాపు 11 గంటల్లోనే ఆ గ్రహంపై ఒక సంవత్సరం పూర్తయిపోతుందన్నమాట. ఈ గ్రహంపై ఉపరితల ఉష్ణోగ్రతలు 2000°C వరకు ఉంటాయట (Space discovery).

    ఈ 'TOI-561 b' గ్రహం.. నక్షత్రానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల దీనిని లావా గ్రహంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు (Lava planet). అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ గ్రహం ఉపరితలం కరిగిపోయి ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ జీవం ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఇంత వేడి ఉన్నప్పటికీ, ఈ గ్రహానికి దట్టమైన వాతావరణం ఉండటం శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. సాధారణంగా ఇంత వేడిగా ఉండే గ్రహాలు తమ వాతావరణాన్ని నిలుపుకోలేవని గతంలో నమ్మేవారు. ఈ గ్రహం వాతావరణంలో నీరు, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు ఉండవచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement