అధికారంలోకి రాగానే బల్క్ డ్రగ్ పార్కు రద్దు చేస్తాం: బొత్స
ఆంధ్రప్రదేశ్ : అనకాపల్లి(D) రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న మత్స్యకారులకు అండగా ఉంటామని వైసిపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ‘ఆందోళన చేస్తున్న మత్స్యకారులు సంఘ విద్రోహ శక్తులా? వారిని ఎందుకు నిర్బంధిస్తున్నారు? వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేస్తాం. త్వరలో జగన్ రాజయ్యపేటలో పర్యటిస్తారు’ అని స్పష్టం చేశారు.
Comments