అన్ క్లెయిమ్డ్ మొత్తం ₹1.84 లక్షల కోట్లు: నిర్మల
బ్యాంకులు, నియంత్రణ సంస్థల వద్ద క్లెయిమ్డ్ కాని డబ్బు ₹1.84 లక్షల కోట్లు ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీన్ని అర్హులైన కస్టమర్లకు అధికారులు తిరిగి చేర్చాలన్నారు. ‘మీ డబ్బు మీ హక్కు’ ప్రచారాన్ని ఆమె గుజరాత్‌లో ప్రారంభించారు. ‘ఈ నగదు సమాచారంపై UDGAM పోర్టల్‌ను RBI ప్రారంభించింది. అర్హులైన వారు ఈ పోర్టల్ లేదా బ్యాంకులో తగిన పత్రాలు చూపించి క్లెయిమ్ చేసుకోవచ్చు’ అని సూచించారు.
Comments