అమెజాన్.. బెంగళూరులో 2వ అతిపెద్ద క్యాంపస్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ బెంగళూరులో ఆసియాలోనే 2వ అతిపెద్ద ఆఫీసును స్టార్ట్ చేసింది. ఐదెకరాల్లో నిర్మించిన ఈ క్యాంపస్‌ను కర్ణాటక మంత్రి MB పాటిల్ ప్రారంభించారు. ఇందులో 7,000 మంది పని చేసేందుకు సౌకర్యాలు కల్పించారు. అమెజాన్ భారత్‌లో ఇప్పటికే 40 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టగా, 2030 నాటికి అదనంగా మరో 35 బిలియన్ డాలర్లను యాడ్ చేయనున్నట్లు తెలిపింది. అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్ లో ఉంది.










Comments