• Apr 19, 2026
  • NPN Log

    చర్ల : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గణపతి, మిసిర్‌ బెస్రా ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ ఇద్దరు నేతల కోసం సుమారు 5వేల మంది బలగాలు జార్ఖండ్‌, ఛత్తీ్‌సగఢ్‌ అడవుల్లో గాలిస్తున్నాయి. అసలు వీరు ఎక్కడ ఉన్నారు? అనే విషయంలో పోలీసుల వద్ద పూర్తి సమాచారం లేదు. బిసిర్‌ బెస్రా జార్ఖండ్‌ అడవుల్లో ఉన్నట్లు సమాచారం రావడంతో పరందా అడవుల్లో గాలింపును బలగాలు ముమ్మరం చేశాయి. గణపతి ఎక్కడున్నాడు? అసలు బతికే ఉన్నాడా? అనేది మాజీ మావోయిస్టులు కూడా చెప్పడం లేదు. ఈ ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు అజ్ఞాతంలో ఉండటంతో వారి వెంట 30 నుంచి 60 మంది చొప్పున మావోయిస్టులు ఉండే అవకాశం లేక పోలేదన్న చర్చ జరుగుతోంది. మరోవైపు జార్ఖండ్‌ పశ్చిమ సింగ్‌భూష్‌ జిల్లా పరందా అడవుల్లో మూడు రోజుల క్రితం కోబ్రా, జార్ఖండ్‌ జాగ్వార్‌ బలగాలు, మావోయిస్టుల మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో కోబ్రా 205 చెందిన ఇన్‌స్పెక్టర్‌ సత్యప్రకాశ్‌తోపాటు, జవాన్లు శైలేశ్‌, సేనాపతి, జితేంద్రకుమార్‌, ప్రేమ్‌ గాయపడ్డారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించి ఉంటారని, ఈ ఘటన నుంచి మిసెల్‌ బెస్రా బృందం తప్పించుకున్నట్లు భావిస్తున్నారు. గాయపడ్డ జవాన్లను మెరుగైన వైద్య చికిత్స కోసం హెలికాప్టర్‌లో తరలించారు. ఛత్తీ్‌సగఢ్‌ అడవుల్లో ఇంకా మావోయిస్టులున్నారనే అనుమానంతో దండకారణ్యంలో కేంద్రబలగాలు కూబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా మావోయిస్టులు అడవుల్లో పెట్టిన మందుపాతర్లపై ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన డీఆర్‌జీ బలగాలు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాయి. మాజీ మావోయిస్టుల సమాచారంతో మందుపాతర్లను గుర్తిస్తున్నారు. అడవుల్లో మావోయిస్టుల డంప్‌లపై కూడా బలగాలు దృష్టి పెట్టాయి. కాగా జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ అడవుల్లో శుక్రవారం మావోయిస్టులు, కోబ్రా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో సహదేవ్‌ మహతో (ఆర్‌సీఎం) సభ్యుడు, నటాషా (దండకారణ్య స్పెషల్‌ జోన్‌ సభుడు), బుదాన్‌ కర్మాలి, రంజిత్‌ ఇద్దరు ఏరియా కమిటీ కమాండర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47 తుపాకులు, కోల్ట్‌ఏర్‌15, ఇస్సాస్‌ తుపాకులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement