ఆగిన బంగారం ఇంపోర్ట్స్.. పెరగనున్న ధరలు?
కేంద్ర ప్రభుత్వం (DGFT) నుంచి అనుమతులు రాకపోవడంతో భారత బ్యాంకులకు బంగారం, వెండి దిగుమతులు నిలిచిపోయాయని రాయిటర్స్ పేర్కొంది. దీంతో టన్నుల కొద్దీ విలువైన లోహాలు కస్టమ్స్ క్లియరెన్స్ లేక ఆర్డర్లు ఆగిపోయాయి. ఏటా ఏప్రిల్ ఆరంభంలోనే ఇచ్చే అనుమతి ఆలస్యం కావడంతో విదేశీ ఆర్డర్లకు బ్రేక్ పడింది. దీనివల్ల దేశీయంగా సరఫరా తగ్గి ధరలు పెరిగే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.










Comments