ఆర్సీ ప్లాస్టో నుంచి అన్బ్రేకబుల్ చైర్
నాగపూర్: ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ ఆర్సీ ప్లాస్టో సరికొత్త కుర్చీని (చైర్) మార్కెట్లో విడుదల చేసింది. యూవీ ప్రొటెక్షన్, యాంటీ ఆక్సిడెంట్ టెక్నాలజీతో రూపొందించిన ఈ అన్బ్రేకబుల్ కుర్చీ 10 సంవత్సరాల హామీతో లభిస్తుందని కంపెనీ తెలిపింది. సాధారణ కుర్చీలతో పోలిస్తే దీనికి ధృడ త్వం, మన్నిక ఎక్కువని పేర్కొంది. ప్రతి ఇంటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్టైలిష్ కుర్చీని డిజైన్ చేసినట్టు తెలిపింది. ప్రతి నగరంలో కంపెనీ డీలర్లు, అధీకృత పంపిణీదారుల వద్ద ఈ కుర్చీలు లభిస్తాయి.
Comments