ఆలస్యం చేస్తే ఊరుకోను.. ట్రంప్ వార్నింగ్
తన ప్రకటనపై హమాస్ వేగంగా స్పందించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘బందీలను విడుదల చేసేందుకు, శాంతి ఒప్పందాన్ని అమలు చేసేందుకు తాత్కాలికంగా బాంబింగ్ ఆపినందుకు ఇజ్రాయెల్‌ను అభినందిస్తున్నా. హమాస్ వైపు నుంచి ఏదైతే జరుగుతుందని అందరూ భావిస్తున్నారో అలాంటి ఆలస్యాన్ని నేను సహించను. బందీలను విడుదల చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి. అందరితో న్యాయంగా వ్యవహరిస్తాం’ అని సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.
Comments