ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
ఆంధ్ర ప్రదేశ్ : ఇంటర్మీడియెట్-2025 పరీక్షల ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగుస్తుండటంతో ఈనెల 22 వరకు దాన్ని బోర్డు పొడిగించింది. జనరల్, వొకేషనల్ కోర్సులు చదివే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్, ప్రయివేటు అభ్యర్థులు గడువులోగా ఫీజు చెల్లించాలని సూచించింది. రూ.1,000 ఆలస్య రుసుముతో ఈనెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇదే చివరి ఛాన్సు అని మరోసారి పొడిగింపు ఉండదని ఇంటర్ బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా స్పష్టం చేశారు.
Comments