ఇంటర్ సెకండియర్కూ ఇంప్రూవ్‌మెంట్.. ఫీజు ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్ : ఈ ఏడాది నుంచి ఇంటర్ సెకండియర్ ఫెయిల్, పాసైన విద్యార్థులు సైతం ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు రూ.600 ఫీజుతోపాటు ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చొప్పున చెల్లించాలని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇటీవల పబ్లిక్ పరీక్షలకు కేటాయించిన ఐడీ నంబరుతోనే రేపటి నుంచి ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా సప్లిమెంటరీ పరీక్షలకూ రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు.










Comments