ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్ విద్యా బోర్డు ప్రకటించింది. రేపటి(సోమవారం) నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మెుదలవుతుందని తెలిపింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఏప్రిల్ 20 చివరి తేదీ అని వెల్లడించింది. మే 22 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. కాగా, ఈరోజు తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 82.73 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానం కైవసం చేసుకోగా.. జైశంకర్ భూపాలపల్లి జిల్లా 82.34 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచింది.










Comments