• Apr 19, 2026
  • NPN Log

    ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వారి వరకు గుండెపోటుల బారిన పడుతున్నారు. అప్పటి వరకు ఎంతో చలాకీగా నవ్వుతూ, తుళ్లుతూ తిరిగిన వారు కూడా కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, సీపీఆర్ చేయటం ద్వారా ప్రాణం పోసుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. గుండెపోటు వచ్చిన వెంటనే సీపీఆర్ చేయటం వల్ల ప్రాణం నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మనుషులు సీపీఆర్ చేయాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం ఉంటుంది.

    ఎక్కువ సేపు సీపీఆర్ చేయటం మనిషి వల్ల కాదు. కానీ, మిషిన్ మనిషి కంటే అద్భుతంగా సీపీఆర్ చేయటంతో పాటు ఎక్కువ సేపు సీపీఆర్ చేయగలదు. ఎంతో నైపుణ్యంతో మిషిన్ సీపీఆర్ చేసి మనిషి ప్రాణాలు నిలబెట్టగలదు. ఇందుకు తాజాగా జరిగిన సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. దుబాయ్‌కి చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడి ఛాతికి సీపీఆర్ మిషిన్‌ను అమర్చారు.

    ఆ సీపీఆర్ మిషిన్ ఎంతో అద్భుతంగా సీపీఆర్ చేసింది. మిషిన్ సీపీఆర్ చేయటంతో పాటు వైద్య సిబ్బంది కృషి వల్ల ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడ్డాయి. అతడు తిరిగి ఊపిరి తీసుకున్నాడు. కళ్లు తెరిచి చుట్టూ చూశాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ మిషిన్ నిజంగా చాలా అద్భుతంగా సీపీఆర్ చేస్తోంది’..‘టెక్నాలజీ ఉపయోగించి ఇలా ప్రాణాలు నిలబెట్టవచ్చని ఇప్పుడే తెలిసింది’..‘టెక్నాలజీనా మజాకా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement