ఈ-కామర్స్ సైట్లలో అదనపు ఛార్జీలు.. కేంద్రమంత్రి స్పందనిదే!
ఈ-కామర్స్ సైట్లలో ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజు & పేమెంట్ హ్యాండ్లింగ్ ఫీజు అంటూ ఎక్స్ట్రా ఛార్జీలను వసూలు చేయడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. దీనిపై ఓ నెటిజన్ ట్వీట్ చేయగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. ‘COD కోసం ఈ-కామర్స్ సైట్స్ అదనంగా ఛార్జీలు వసూలు చేయడంపై వినియోగదారుల వ్యవహారాల శాఖకు ఫిర్యాదులొచ్చాయి. వీటిపై దర్యాప్తు ప్రారంభమైంది. నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.
Comments