ఈ నెల 10 నుంచి సెట్ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్ : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగాలకు అర్హత కల్పించే..సెట్(రాష్ట్ర అర్హత పరీక్ష) పరీక్ష డిసెంబరు రెండోవారంలో జరగనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం బుధవారం విడుదల చేసింది. మూడు గంటల వ్యవధి గల పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయని వర్సిటీ టీజీ సెట్ కార్యదర్శి ఆచార్య బి. శ్రీనివాస్ తెలిపారు. పరీక్ష సీబీటీ(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) పద్ధతిలో ఉంటుందని, ఈనెల 10 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు
Comments