ఊహించడానికే భయంకరంగా ఉంది: రష్మిక
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై రష్మిక తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘అగ్ని ప్రమాద ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. మంటలలో చిక్కుకున్న ప్రయాణికుల బాధ ఊహించడానికే భయంకరంగా ఉంది. చిన్నపిల్లలు, మొత్తం కుటుంబం, చాలా మంది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నా. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి’ అని Xలో పేర్కొన్నారు.










Comments