ఎక్సైజ్ అధికారులు ఉన్నా.. లేనట్టేనా..?
మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో బ్రాందీషాపుల యజమానులు అధిక లాభార్జనే ద్యేయంగా ఇద్దరు ఒక్కటై సిండికెట్ ముసుగులో బెల్ట్ దందాను ప్రోత్సహిస్తూ మధ్యం అమ్మకం పేరుతో సామాన్యుల సొమ్ము లూటి చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు ఉన్నా.. లేనట్టేనా..? ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా బెల్ట్ ముసుగులో అధిక ధరలకు మధ్యం అమ్ముతుంటే సంబందించిన అధికారులు ఏంచేస్తున్నట్లు. దసరా పండుగ గాంధీ జయంతి రోజున వస్తుండడంతో బుధవారం రోజున మధ్యాన్ని పెద్ద మొత్తంలో మండలంలోని అన్ని గ్రామాలకు ముందస్తుగా తరలిస్తున్నారు. ఒక్క బాటిల్ కు 80 రూపాయలు, బీరు కు 50 రూపాయల వరకు ఎక్కువ ధరలకు విక్రయించడంతో కొనుగోలు దారులు మండిపడుతున్నారు. ఇష్టా రాజ్యాంగ మధ్యం అమ్మకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటు మండలంలోని రెండు మధ్యం షాపులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments