‘ఎయిర్ బస్’ ఛైర్మన్‌తో లోకేశ్ భేటీ
ఆంధ్ర ప్రదేశ్ : నెదర్లాండ్స్‌కు చెందిన ‘ఎయిర్ బస్’ ఛైర్మన్ రెనే ఒబర్మాన్, కంపెనీ బోర్డు సభ్యులతో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరల్డ్ క్లాస్ ఏరో స్పేస్ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలోని సానుకూల వాతావరణాన్ని వివరించారు. భూమి అందుబాటు, మల్టీ కారిడార్ ఆప్షన్ సహా ప్రపంచంతో పోటీపడేలా పలు విధానాల అమలు గురించి చెప్పారు. రాష్ట్రాన్ని ఏరో స్పేస్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు.
Comments