ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం..
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు లో బుల్లెట్ కలకలం రేపింది. ఆర్జీఐఏ ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం కోల్‌కతాకు చెందిన విశాల్ 6ఈ6709 విమానంలో కోల్‌కత్తా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టు లో ఐఎల్‌బీఎస్ సెక్యూరిటీ సిబ్బంది అతని బ్యాగులు స్కాన్ చేయగా అందులో 38 ఎంఎం బుల్లెట్ లభించింది.
అతడిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అతడికి బుల్లెట్ ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుల్లెట్‌తో పట్టుబడిన వ్యక్తి బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, తండ్రి ఆర్మీలో ఉన్నట్లు సీఐ కనకయ్య తెలిపారు.









Comments