ఎల్ఐసీ ఎండీగా ఆర్. చందర్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో డైరెక్టర్లను ఎంపిక చేసే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో (ఎఫ్‌ఎ్‌సఐబీ).. జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఏండీ) పదవికి ఆర్. చందర్‌ను సిఫారసు చేసింది. ఈ ప్రతిష్టాత్మక పదవి కోసం మొత్తం ఐదుగురు అభ్యర్థులను బోర్డు ఇంటర్వూ చేయగా, వారీ పనితీరు, సమగ్ర అనుభవం, నియామాక ప్రమాణాల ఆధారంగా చందర్‌ను ఎంపిక చేసినట్లు ఎఫ్‌ఎ్‌సఐబీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామక వ్యవహారాల కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది.
యూనియన్ బ్యాంక్ సీఈఓగా ఆశీష్ పాండే: రెండు ప్రభుత్వరంగ బ్యాంకులకు కొత్త సారథులను ప్రభుత్వం నియమించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏండీ, సీఈఓగా ఆశీష్ పాండేను, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధిపతిగా కల్యాణ్ కుమార్‌ను మూడు సంవత్సరాల కాలానికి నియమించింది. పాండే ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పనిచేస్తుండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్న కల్యాణ్ కుమార్, జూలైలో పదవీ విరమణ చేసిన ఏం.వీ రావు స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
Comments