ఎస్ఎస్సీ పరీక్ష తేదీ మార్పు
హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎసపసీ) పరీక్ష తేదీలు ఒకేరోజు ఉండటంతో రాష్ట్ర విద్యార్థులకు ఎస్‌ఎ్‌ససీ ఊరట కల్పించింది. ఆర్అండ్బీ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పరీక్షను టీజీపీఎస్సీ నవంబరు 6, 7 తేదీల్లో నిర్వహించనుంది. ఎస్ఎస్సీ సైతం జూనియర్ ఇంజినీర్ పరీక్షల తేదీలను నవంబరు 2-6గా ప్రకటించింది. రెండు పోస్టులకు బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ అర్హత కావడంతో రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య రాష్ట్రం నుంచి ఎక్కువగా ఉంది. దీంతో ఎస్ఎస్సీ ఇటీవలే ప్రకటించిన తేదీలపై అభ్యర్థులు టీజీపీఎస్సీకి వినతిపత్రం ఇచ్చారు. పరీక్ష తేదీలను మార్చాలని కోరారు. దీనిపై సంస్థ ఛైర్మన్ బుర్రా వెంకటేశం సోమవారం ఎస్ఎస్సీ ఛైర్మన్‌తో మాట్లాడారు.
ఈ మేరకు నవంబరు 6న పరీక్ష ఉన్న తెలంగాణ విద్యార్థులకు నవంబరు 4, 5 తేదీల్లో పాల్గొనేలా అవకాశం కల్పిస్తామని ఎస్ఎస్సీ ఛైర్మన్ తెలిపారని బుర్రా వెంకటేశం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబరు 6 పరీక్ష తేదీ మార్చుకోవాలనుకునే అభ్యర్థులు రెండు పరీక్షల హాల్ టికెట్లతోపాటు టీజీపీఎస్సీ ఓటీఆర్ నంబరును ఈనెల 30 సాయంత్రం 6గంటల లోపు టీజీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన హెల్ప్‌డెస్క్‌లో అందించాలని లేదా టీజీపీఎస్సీ హెల్ప్‌డెస్క్‌కు ఈ-మెయిల్ చేయవచ్చన్నారు. ఎస్ఎస్సీ తేదీలు మారని విద్యార్థులకు నవంబరు 7న పరీక్ష నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు. కాగా కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి సోమవారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగిందని టీజీపీఎస్సీ తెలిపింది. 15 జిల్లాల్లోని 55 కేంద్రాల్లో సీబీటీ విధానంలో ఈ పరీక్ష నిర్వహించారు.










Comments