ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. 24న సెకండియర్ స్టూడెంట్స్‌కు లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జనవరి 23న ఎన్విరాన్‌మెంటల్ ఎగ్జామ్, ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్, 13న సమగ్ర శిక్షా పరీక్షలు జరగన్నాయి.
Comments