ఏసీ సమస్య.. ఏఐ తీర్చింది!
జపాన్ టూర్‌లో ఎదురైన భాషా సమస్యను AIతో పరిష్కరించుకున్నారో అమెరికన్. మైఖేల్ గాల్పెర్ట్ అనే వ్యక్తి హోటల్‌లో ఉక్కపోతగా ఉండటంతో 4AMకు మేల్కొన్నారు. ACని అడ్జస్ట్ చేద్దామని రిమోట్ తీసుకుంటే దానిపై జపనీస్ భాష ఉంది. అది అర్థం కాకపోవడంతో గూగుల్ ఏఐ టూల్ ‘నానో బనానా’ సాయం తీసుకున్నారు. రిమోట్‌ను ఫొటో తీసి, ఇంగ్లిష్ బటన్లతో రిమోట్ ఫొటో ఇవ్వమని కోరారు. అది వెంటనే ఇవ్వడంతో టెంపరేచర్ తగ్గించి చల్లబడ్డారు.










Comments