ఐరన్ మ్యాన్ పోటీల్లో రికార్డు సృష్టించిన రీనీ నోరోన్హా
ప్రపంచంలో అత్యంత కఠినమైన క్రీడాంశాల్లో ఒకటైన ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్‌ను పూర్తి చేసి మన దేశంలో పిన్నవయస్కురాలైన మహిళా ఐరన్‌మ్యాన్‌గా చరిత్రకెక్కారు రీనీ నోరోన్హా. 19 ఏళ్ళ రీనీ 3.8 కి.మీ స్విమ్మింగ్, 180 కి.మీ బైక్ రైడ్, 42.2 కి.మీ రన్ ఈవెంట్లను పద్నాలుగు గంటల్లోనే పూర్తి చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈమె ప్రస్తుతం చెన్నై ఐఐటిలో డేటా సైన్స్ అప్లికేషన్స్‌లో డిగ్రీ చేస్తున్నారు.








Comments