కొడుకు కాదు క్రూరుడు
ప్రొద్దుటూరు : ఆన్‌లైన్ గేమ్స్ ఆడి అప్పుల పాలై.. వాటిని తీర్చడానికి ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వలేదన్న కక్షతో కన్నతండ్రిపైనే కక్ష పెంచుకున్నాడు ఓ ఉన్మాది. తండ్రితోపాటు.. సహజీవనం చేస్తున్న మారుతల్లిని కూడా క్రూరంగా హతమార్చాడు. కడప జిల్లా జమ్మలమడుగులో శనివారం రాత్రి ఈ దారుణం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. జమ్మలమడుగు మండలం మోరగూడి గ్రామంలో సిమెంటు ఇటుకల బట్టీలో శనివారం రాత్రి షెడ్డు కింద కూడేటి నాగప్ప (63), పాముల పెద్దక్క (48) దంపతులు హత్యకు గురయ్యారు. వారు మంచంపై నిద్రిస్తున్న సమయంలో ౖ చిన్నకొడుకే తలలపై కర్రతో బలంగా మోది దారుణంగా హత్య చేసినట్లు పెద్ద కొడుకు పెద్ద వెంకటేశ్ సైతం చెబుతున్నారు.
కొన్నేళ్లుగా విడిగా జీవిస్తున్న నాగప్ప
నాగప్ప పాతికేళ్లుగా పాముల పెద్దక్కతో కలిసి సహజీవనం చేస్తూ మోరగుడిలో ఇటుకల బట్టీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మొదటి భార్య ఓబులమ్మకు పెద్ద వెంకటేశ్, చిన్న వెంకటేశ్ ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇరువురికీ వివాహాలై వేర్వేరుగా ఉంటున్నారు. నాగప్పకు జమ్మలమడుగులో నాలుగు సొంతిళ్లు, స్థలాలు ఉన్నాయి. చిన్న కుమారుడు వెంకటేశ్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తూ ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడి రూ.22 లక్షల మేర అప్పులు చేశాడని చెబుతున్నారు. అప్పులు తీర్చడానికి రెండు కోట్ల విలువైన 8 సెంట్ల స్థలం అమ్మి డబ్బులు ఇవ్వాలని తండ్రితో ఘర్షణ పడేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ హత్య జరిగింది. దంపతులు హత్యకు గురైన సమాచారం తెలియడంతో పెద్దకొడుకు సహా బంఽధువులు, గ్రామస్థులు ఘటనా స్థలం వద్ద రాగా, చిన్నకొడుకు మాత్ర రాలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించ గా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.









Comments