కర్ణాటకలో టీసీఎస్ఎల్ ఎయిర్‌బస్ హెలీకాప్టర్ ప్లాంట్
న్యూఢిల్లీ: యూర్‌పనకు చెందిన విమాన తయారీ దిగ్గజం ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎ్‌సఎల్) ఉమ్మడి భాగస్వామ్యంలో హెచ్125 హెలీకాప్టర్ల తుది అసెంబ్లీ లైన్ కర్ణాటకలోని వామగల్‌లో ఏర్పాటు చేయనున్నాయి. పూర్తిగా భారతదేశంలోనే తయారైన తొలి హెలీకాప్టర్ 2027 ప్రారంభంలో ఈ ప్లాంట్ నుంచి విడుదల కానున్నట్టు రెండు కంపెనీలు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. గుజరాత్‌లోని వడోదరాలో సి295 హెలీకాప్టర్ల తయారీ తర్వాత వస్తున్న రెండో ప్లాంట్ ఇది. అలాగే దేశంలో పూర్తిగా ప్రైవేట్ రంగంలో ఏర్పాటవుతున్న తొలి హెలీకాప్టర్ అసెంబ్లీ లైన్ ఇది. ఇదే ప్లాంట్ నుంచి ఈ హెలీకాప్టర్ మిలిటరీ వెర్షన్ హెచ్125ఎం కూడా తయారుచేసే యోచన ఉన్నట్టు తెలిపాయి.
Comments