• Mar 02, 2026
  • NPN Log
    కార్పొరేషన్స్ పరిధిలో కాంట్రాక్టు కార్మికులకు బి కేటగిరి వేతనాలు చెల్లించాలి. కార్పొరేషన్స్ పరిధిలో కాంట్రాక్టు కార్మికులకు బి కేటగిరి వేతనాలు చెల్లించాలి. డైరెక్టర్ ఆపరేషన్ కు వినతి పత్రం సమర్పించిన ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సింగరేణిలో పనిచేస్తున్న కొత్తగూడెం,రామగుండం, మంచిర్యాల కార్పొరేషన్స్ పరిధిలోని అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు కేంద్ర ప్రభుత్వ కనీస వేతనాలు జీవోలోని బి కేటగిరి వేతనాలను చెల్లించుటకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్- AITUC అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య వారు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ లో సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ శ్రీ LV సూర్యనారాయణ వారికి ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది.ఈ సందర్భంగా సీతారామయ్య వారు మాట్లాడుతూ సింగరేణిలో వేతనాలను పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర సమస్యలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇతర సంఘాల ను కలుపుకొని అనేక పోరాటాలను చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సింగరేణి వ్యాపితంగా కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపదలకు యాజమాన్యం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ గా మారిన నేపథ్యంలో సింగరేణిలో కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు చెల్లిస్తున్న సి కేటగిరి వేతనాల స్థానంలో బి కేటగిరి వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. దీని ప్రకారం అన్ స్కిల్డ్ కార్మికులకు రూ:674/- ,సెమీస్కిల్డ్ కార్మికులకు రూ :760/-, స్కిల్డ్ కార్మికులకు రూ :893/-, హైలీ స్కిల్డ్ కార్మికులకు రూ:981/-, సెక్యూరిటీ గార్డులకు రూ:893/- చెల్లించవలసి ఉన్నదని డిమాండ్ చేశారు.ఈ సమస్య పరిష్కారానికి తక్షణమే యాజమాన్యం,లేబర్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బ్రాంచ్ కార్యదర్శి SV రమణమూర్తి,కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్- AITUC కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య,ఉపాధ్యక్షులు కె డబ్ల్యూ కృష్ణ ఫర్ నాయకులు ఎం చంద్రశేఖర్,మురళి తదితరులు పాల్గొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement