• Apr 19, 2026
  • NPN Log

    జగిత్యాల : మాజీ మంత్రి కేటీఆర్‌పై  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్  హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ ఫామ్‌హౌస్‌కు తాను ఏనాడూ పోలేదని స్పష్టం చేశారు. ఆయన కంటే తాను ఎందులోనూ తక్కువ కాదని తేల్చిచెప్పారు. ఈరోజు (ఆదివారం) జగిత్యాల వేదికగా సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తన కంటే ఆయనకు అహంకారం, అక్రమ సంపాదన మాత్రమే ఎక్కువని విమర్శించారు.

    తన బ్రీడ్ కాదని.. ఆయన ఇంతకీ ఏ బ్రీడ్ అని ప్రశ్నించారు. క్రాస్ ఓటింగ్ చేయించిన ఆయనది క్రాస్ బ్రీడ్ అని ఎద్దేవా చేశారు. తాను రాజకీయ వ్యభిచారి అయితే.. నువ్వు వ్యభిచార కొంప నడిపావా..? అని సెటైర్లు గుప్పించారు. వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నుంచి పలువురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని.. ఆయనదా క్రాస్ బ్రీడ్....? తమదా..? అని నిలదీశారు. కేటీఆర్ నీ అహంకారం, అక్రమ సంపాదన తన ముందు పని చేయవని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హెచ్చరించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement