• Apr 07, 2026
  • NPN Log

    అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవ సోదరులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈస్టర్ పండుగ ప్రేమ, విశ్వాసం, నమ్మకం లాంటి పవిత్ర భావనలను పాదుగొలిపే పవిత్ర దినమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఆదివారం ఓ పోస్టు పెట్టారు.

    ఆ పోస్టులో.. ‘పాపుల కోసం శిలువనెక్కిన ఏసు ప్రభువు పునరుత్థానం చెందిన పవిత్రమైన ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు. ఈస్టర్ పండుగ ప్రేమ, విశ్వాసం, నమ్మకం లాంటి పవిత్ర భావనలను పాదుగొలిపే పవిత్ర దినం. పాప ప్రక్షాళన కోసం క్రీస్తు చేసిన త్యాగం మనకు ఆదర్శం కావాలి. ఆయన చూపిన శాంతి మార్గంలో నడుస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు కలకాలం ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’ అని అన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement