క్వార్టర్స్‌లో జ్యోతికి నిరాశ
గ్వాంగ్జు (కొరియా): ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షి్‌పలో తెలుగు ఆర్చర్ జ్యోతి సురేఖకు నిరాశ ఎదురైంది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్స్‌లో భారత్‌కే చెందిన పర్ణీత్ కౌర్ 149-147తో సురేఖను ఓడించింది. కాగా, సెమీ్‌సలో 142-143తో సోఫియా పైజ్ (ఎల్ సాల్వడార్) చేతిలో పరాజయం పాలైన పర్ణీత్ కౌర్.. కాంస్యం పోరులోనూ విఫలమైంది. కౌర్ 144-145తో అలెగ్జాండ్రా ఉస్కియానో (కొలంబియా) చేతిలో ఓటమి పాలైంది. మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో వెటరన్ దీపిక కుమారి, గథా కడాకే, అంకిత భక్త్‌లతో కూడిన భారత జట్టు సెమీ్‌సలో 2-6తో జపాన్ చేతిలో ఓడింది. కాంస్యం కోసం కొరియాతో తలపడనుంది.
Comments