• Apr 19, 2026
  • NPN Log

    భారత్‌లో బంగారం, వెండి ధరలు గత నాలుగు రోజులుగా ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు తగ్గుతాయన్న సంకేతాలతో పాటు అక్షయ తృతియ సమీపిస్తున్న తరుణంలో బంగారం, వెండిలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. గత మూడు రోజుల్లో పసిడి ధరలు సుమారు రూ.3 వేల మేర పెరిగాయి.

    గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ కథనం ప్రకారం, నేడు (ఏప్రిల్ 17) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,580గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,610గా ఉంది. వెండి ధర దాదాపుగా స్థిరంగానే ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,74,900 వద్ద కొనసాగుతోంది.

     

    చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,670గా ఉంది. ముంబైలో రూ.1,55,580 వద్ద, న్యూఢిల్లీలో రూ.1,55,730 వద్ద కదలాడుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర చెన్నైలో రూ.1,43,610గా, ముంబైలో రూ.1,42,610గా, న్యూఢిల్లీలో రూ.1,42,760గా ఉంది. దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో వెండి ధరలు రూ.2,69 లక్షల నుంచి రూ.2,74,900 వరకూ ఉన్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ల పసిడి ధర 4,787గా, ఔన్స్ వెండి ధర 78 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement