జేఈఈ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు
జేఈఈ మెయిన్స్ సెషన్-1 పేపర్-2లో తెలుగు తేజాలు మెరిశాయి. పేపర్ 2ఏలో తెలంగాణ కి చెందిన శ్రేయస్ రెడ్డి 99.99 పర్సంటైల్.. ఏపీ నుంచి శరణ్య అశ్విని 99.95 స్కోర్ సాధించారు. పేపర్ 2బీలో తెలంగాణ నుంచి నాగ ప్రద్యుమ్న రెడ్డి 99.98, ఏపీలో హర్షాదిత్య, ఈశ్వర్ రాజ్, భీమ తులిప్ 99.95 స్కోర్ చేశారు. కేరళకు చెందిన సూర్యతేజస్, గౌరీశంకర్ మాత్రమే 100 పర్సంటైల్ సాధించారు. కాగా సెషన్-2 రిజిస్ట్రేషన్‌కు రేపే లాస్ట్ డేట్.










Comments