• Apr 19, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : సామాజిక, రాజకీయ, ఆర్థిక కుల గణన సర్వే అధ్యయనానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ కంచె ఐలయ్యలను శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ వారి నివాసాలకు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆర్థిక సామాజిక, రాజకీయ అసమానతలను తొలగించేందుకు కమిటీ చేసే సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, కంచె ఐలయ్యలను వారు సన్మానించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement