• Apr 19, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : టీసీఎస్‌ నాసిక్‌ బీపీవోలో లైంగిక వేధింపులు, మతమార్పిడి ప్రయత్నాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ సంస్థ మొత్తం వ్యవహారంపై జరిపే అంతర్గత దర్యాప్తులో ప్రపంచ ప్రఖ్యాత ఆడిట్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ దర్యాప్తు సంస్థ డెలాయిట్‌ను, ప్రముఖ భారతీయ లాఫర్మ్‌ ట్రైలీగల్‌ను భాగస్వాములను చేసింది. ఈ మేరకు టీసీఎస్‌ బీఎ్‌సఈకి సమాచారం అందించింది. అంతర్గత దర్యాప్తునకు టీసీఎస్‌ సీవోవో ఆర్తీ సుబ్రమణియన్‌ నేతృత్వం వహిస్తారు. రెండు సంస్థల నిపుణుల బృందాలు టీసీఎస్‌ దర్యాప్తులో భాగం పంచుకుంటాయి. టీసీఎ్‌సలో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న కేకీ మిస్త్రీ నేతృత్వంలో పర్యవేక్షక కమిటీని వేస్తున్నామని సంస్థ తెలిపింది. దర్యాప్తు బృందం నివేదికను పర్యవేక్షక కమిటీకి అందిస్తారు. లైంగిక వేధింపులకు సహకరించిందని చెబుతున్న నిదా ఖాన్‌ తమ కంపెనీలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌ కాదని టీసీఎస్‌ బీఎ్‌సఈకి సమాచారం ఇచ్చింది. ఆమెకు ఎలాంటి రిక్రూట్మెంట్‌ బాధ్యతలు లేవని స్పష్టం చేసింది. ఆమె కేవలం ప్రాసెస్‌ అసోసియేట్‌గా చేసినట్లు వెల్లడించింది. నాసిక్‌ బీపీవో మూతపడినట్లు వచ్చిన వార్తలను టీసీఎస్‌ ఖండించింది. అక్కడ సేవలు కొనసాగుతున్నాయని చెప్పింది. తమకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం లైంగిక వేధింపుల నివారణ(పోష్‌) కమిటీకి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని వెల్లడించింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement