• Apr 19, 2026
  • NPN Log

    టెక్నాలజీ విషయంలో చైనా ప్రపంచ దేశాలకు గట్టిపోటీ ఇస్తోంది. మరీ ముఖ్యంగా రోబోటిక్స్ రంగంలో తనకు తానే పోటీ, సాటి అని నిరూపించుకుంటోంది. రోబోలతో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది. చైనాకు చెందిన రోబోటిక్స్ కంపెనీలు మనుషుల్లా అన్ని పనులు చేసే హ్యూమనాయిడ్ రోబోలను సైతం తయారు చేశాయి. యూనీట్రీ రోబోటిక్స్ సంస్థ జీ1 హ్యూమనాయిడ్ మోడల్‌ రోబోలను తయారు చేసింది. ఈ రోబోలు మనుషుల్లా డ్యాన్స్‌లు కూడా చేస్తాయి. యూనీట్రీ కంపెనీ తమ రోబోలతో దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తోంది.

    మార్చి 31వ తేదీన షాంగ్సీ ప్రావిన్స్‌లో జీ1 హ్యూమనాయిడ్ రోబో ప్రదర్శన జరిగింది. రోడ్డుపై రోబో డ్యాన్స్ ప్రదర్శన ఇస్తుండగా.. జనం పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడారు. చిన్నా పెద్దా అంతా కలిసి ఎంతో ఆసక్తిగా రోబో డ్యాన్స్ చూడసాగారు. రోబో గిరగిరా తిరగటంతో దాని చెయ్యి అక్కడే ఉన్న ఓ పిల్లాడి మూతికి తగిలింది. రోబో చెయ్యి బలంగా తాకటంతో పిల్లాడు నొప్పితో గిలగిల్లాడాడు. కంపెనీ సిబ్బంది ఒకరు దాన్ని అక్కడినుంచి పక్కకు తీసుకువచ్చారు. ఆ రోబో పిల్లాడి గురించి పట్టించుకోకుండా డ్యాన్స్ చేసింది. కొద్దిసేపటి తర్వాత ఆగిపోయింది.

    ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో మారింది. ఆ వీడియోలో రోబో చెయ్యి బాలుడికి తగిలిన దృశ్యాలు ఉన్నాయి. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఎంతైనా మనుషులు మనుషులే.. యంత్రాలు యంత్రాలే.. వాటికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు’..‘ఈ రోబోలతో నష్టం తప్ప లాభం ఏమాత్రం ఉండదు. రాబోయే కాలంలో ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement