తగ్గేదేలే.. లూసిఫర్-3 కచ్చితంగా చేస్తా: పృథ్వీరాజ్
ఒకట్రెండు కమిట్‌మెంట్లు పూర్తయిన తర్వాత లూసిఫర్-3ని కచ్చితంగా తీస్తానని నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. మోహన్ లాల్ డేట్స్ కుదరడమూ ముఖ్యమని పేర్కొన్నారు. ‘L2: ఎంపురాన్’ సినిమా కొద్ది మందికి నచ్చకపోయినా తన నిబద్ధత తగ్గదని చెప్పారు. ఆ చిత్రంలో గుజరాత్ అల్లర్ల ప్రస్తావనపై స్పందిస్తూ ‘రాజకీయ ప్రయోజనాల కోసం రూ.కోట్లు పెట్టి సినిమా తీసే వ్యక్తిని కాదు’ అని స్పష్టం చేశారు.










Comments