• Mar 02, 2026
  • NPN Log

    దేశంలో నిన్న (గురువారం) బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతకుముందు రెండు రోజుల పాటు దిద్దుబాటుకు గురైన ధరలు పుంజుకున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోత ఉంటుందన్న అంచనాలు పెరగడంతో ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.

    గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 8.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,500గా ఉంది. నిన్న ఇదే సమయానికి ఉన్న ధరలతో పోలిస్తే దాదాపు రూ.2,230 మేర పెరిగింది. 22 క్యారెట్ 10 గ్రాముల ధర కూడా రూ.2,110 మేర పెరిగి రూ.1,43,460కు చేరుకుంది. ఇక నగరంలో వెండి ధర కూడా రూ.10 వేల మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,70,100గా ఉంది.


    నేడు విడుదల కానున్న ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యపరపతి విధాన సమావేశం తాలూకు వివరాల ప్రభావం ట్రేడింగ్‌పై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. త్వరలో విడుదల కానున్న అమెరికా జీడీపీ నాలుగవ త్రైమాసిక ఫలితాలకు అనుగుణంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండనున్నాయి.


     

    దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే) ధరలు

    చెన్నై: ₹1,58,190; ₹1,45,010

    ముంబై: ₹1,56,500; ₹1,43,460

    న్యూఢిల్లీ: ₹1,56,650; ₹1,43,610

    కోల్‌కతా: ₹1,56,500; ₹1,43,460

    బెంగళూరు: ₹1,56,500; ₹1,43,460

    హైదరాబాద్: ₹1,56,500; ₹1,43,460

    విజయవాడ: ₹1,56,500; ₹1,43,460

    కేరళ: ₹1,56,500; ₹1,43,460

    పుణె: ₹1,56,500; ₹1,43,460

    వడోదరా: ₹1,56,550; ₹1,43,510

    అహ్మదాబాద్: ₹1,56,550; ₹1,43,510

    వెండి (కిలో) ధరలు ఇవీ

    చెన్నై: ₹2,70,200

    ముంబై: ₹2,70,100

    ఢిల్లీ: ₹2,70,110

    కోల్‌కతా: ₹2,70,100

    బెంగళూరు: ₹2,70,100

    హైదరాబాద్: ₹2,70,100

    విజయవాడ: ₹2,70,100

    కేరళ: ₹2,70,000

    పుణె: ₹2,70,100

    వడోదరా: ₹2,70,000

    అహ్మదాబాద్: ₹2,70,100

    గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement