తిరుమల: దర్శనానికి ఎంత టైం పడుతోందంటే?
ఆంధ్ర ప్రదేశ్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి 15-18గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం క్యూ ఆక్టోపస్ భవనం నుంచి కొనసాగుతోంది. శుక్రవారం 73,581 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 28,976 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.60 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
Comments