తొలిసారి భారత్కు యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని స్టార్మర్
యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్ స్టార్మర్ తొలిసారి భారత్కు రానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన అక్టోబర్ 8, 9 తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు. ఇదే ఆయన తొలి అధికారిక పర్యటన. ఈనెల 9న ఇద్దరు ప్రధానులు ముంబై వేదికగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరుపుతారు. ముంబైలో జరిగే 6వ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్కూ వీరిద్దరు హాజరుకానున్నారు.
Comments