దక్షిణమధ్య రైల్వేకు రూ. 10,143 కోట్ల ఆదాయం
హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో రూ.10,143 కోట్ల స్థూల ఆదాయాన్ని సాధించింది. 71.14 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో రూ.6,635 కోట్ల ఆదాయం లభించగా, ప్రయాణికుల విభాగం నుంచి రూ.2,991 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం(2024-25) ఏప్రిల్-సెప్టెంబరు మధ్య వచ్చిన ఆదాయం రూ. 9,966 కోట్లతో పోల్చితే ఈ ఏడాది ఆదాయం రూ.177 కోట్లు(1.7శాతం) అదనం.
సరుకు రవాణాలో మునుపెన్నడూ లేని విధంగా 71.14 మిలియన్ టన్నుల సరుకు లోడింగ్‌ను సాధించింది. గతేడాది లోడ్ చేసిన 67 మిలియన్ టన్నుల కంటే 6 శాతం ఎక్కువ. దక్షిణమధ్యరైల్వే జోన్‌కు రికార్డు స్థాయిలో ఆదాయం పెరగడంపై జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ రైల్వే అధికారులను, ఉద్యోగులను అభినందించారు.
Comments